The Raja Saab

The Raja Saab: షూటింగ్ చివరి దశలో రాజాసాబ్..?

The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఇంకా 10 శాతం టాకీ పోర్షన్ పెండింగ్ లో ఉంది. అలాగే 3 సాంగ్స్ షూట్ బ్యాలెన్స్ ఉన్నాయట. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు టీజర్ రెడీ చేస్తున్నారు. త్వరలో టీజర్ రిలీజ్ డేట్ ఉండొచ్చు. ఇప్పటి వరకు జస్ట్ గ్లిమ్స్ మాత్రమే వదిలారు. ఆ గ్లింప్స్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తరువాత అసలు ఈ సినిమా నుండి ఇంకా ఎటువంటి అప్డేట్ లేదు. మరోవైపు ఏప్రిల్ 10న ‘ది రాజాసాబ్‌’ను రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. అంటే రిలీజ్ కు కేవలం నెల రోజులు మాత్రమే ఉంది. అసలు అనుకున్న టైమ్ కు ఈ సినిమా వస్తుందా రాదా అనే క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Yash: యష్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్.. వాయిదా పడ్డ టాక్సిక్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *