War 2: వార్ 2 సినిమా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లాంటి భారత సినిమా దిగ్గజాలను ఒకే తెరపై చూసే అరుదైన అవకాశాన్ని అందిస్తోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సితార నాగవంశీ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ ఎంట్రీ సీన్స్ థియేటర్లలో సంచలనం సృష్టిస్తాయని, ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తప్పవని నాగవంశీ వెల్లడించారు.
Also Read: Ramayana: హాలీవుడ్ ఆశ్చర్యపోయేలా భారత రామాయణ సంచలనం!
హృతిక్, ఎన్టీఆర్ మధ్య యాక్షన్ సన్నివేశాలు విజువల్ ట్రీట్‌గా ఉంటాయని, ఇద్దరూ ఒకరితో ఒకరు తలపడే సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆయన హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 14న తెల్లవారుజామున షోలతో ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమా తొలి రోజు భారీ కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులని నమోదు చేస్తుందో చూడాలి.
