The Paradise: నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా షూటింగ్ నిన్నటి నుంచి ప్రారంభమైంది. అయితే, ‘హిట్ 3’ ప్రమోషన్స్ కోసం అమెరికాలో ఉన్న నాని ఈ షూట్‌లో ఇంకా జాయిన్ కాలేదు. ప్రస్తుతం నాని చిన్ననాటి ఎపిసోడ్స్‌ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
అమెరికా నుంచి తిరిగొచ్చిన నాని కొంత విశ్రాంతి తీసుకుని, మే 18 నుంచి షూటింగ్‌లో పాల్గొననున్నారు. తొలుత టాకీ పార్ట్‌ను షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సికిందరాబాద్ ప్యారడైజ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా, రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: Nayanthara: చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాకు నయనతార భారీ రెమ్యూనరేషన్!
The Paradise: అయితే, దీనిపై అధికారిక సమాచారం లేదు. గతంలో విడుదలైన గ్లింప్స్‌తోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సరిగమ సంస్థ సహ-నిర్మాణంలో భాగమైనట్లు సమాచారం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా రూపొందుతోంది.