The Paradise: నాచురల్ స్టార్ నాని మరో సంచలన చిత్రంతో రాబోతున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ నుంచి తాజాగా ఓ విభిన్నమైన పోస్టర్ విడుదలైంది. నాని లుక్ అభిమానులను ఆశ్చర్యపరిచేలా ఉంది. ముక్కుకు రింగులు, జడలతో నాని సరికొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. పోస్టర్‌లోని నేపథ్యం హింస, రక్తపాతాన్ని సూచిస్తూ ఆసక్తి రేకెత్తిస్తోంది. అనిరుద్ సంగీతం, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ నిర్మాణంతో ఈ చిత్రం భారీ అంచనాలు సృష్టిస్తోంది.
Also Read: Ravi Teja: రవితేజ సినిమాకు ఊహించని షాక్!
‘ది ప్యారడైజ్’ చిత్రంలో నాని పాత్ర పేరు ‘జడల్’ అని ప్రకటించారు మేకర్స్. ఈ పాత్ర కోసం నాని పూర్తిగా మారిపోయిన తీరు చూస్తే, ఆయన గట్స్‌కు ఫిదా కాకుండా ఉండలేం. పోస్టర్‌లో తుపాకులు, గొడ్డళ్లు, బ్లేడ్‌లతో నిండిన బ్యాక్‌గ్రౌండ్ చూస్తుంటే.. ఈ సినిమాలో యాక్షన్ డోస్ ఎక్కువగా ఉంటుందని సంకేతమిస్తోంది. శ్రీకాంత్ ఓదెల కథాగమనం, నాని నటనతో ఈ చిత్రం ఓ పవర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది. మొత్తానికి పోస్టర్ తో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది.
His Name/వాడి పేరు
‘Jadal’
‘జడల్’Calling a spade a spade. #THEPARADISE @odela_srikanth @anirudhofficial @SLVCinemasOffl @Dop_Sai @NavinNooli @artkolla @kabilanchelliah pic.twitter.com/gN3i0fPxv7
— Nani (@NameisNani) August 8, 2025
