The Paradise: టాలీవుడ్‌లో కొత్త సంచలనం ‘ది ప్యారడైజ్’ సినిమా గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాక్! ఈ సినిమా ఇంటర్వెల్ సీన్, గతంలో సంచలన విజయం సాధించిన ‘దసరా’ చిత్రం ఇంటర్వెల్ కంటే 10 రెట్లు అద్భుతంగా ఉంటుందని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. నాని హీరోగా నటించిన ఈ సినిమా, ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్‌లో ఊహించని ట్విస్ట్‌లు, ఉత్కంఠభరిత సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తాయట. ఒక్కో సీన్ చూస్తుంటే గూస్‌బంప్స్ రాకమానవని తెలుస్తుంద. ‘దసరా’ సినిమా ఇంటర్వెల్ బ్లాక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన నాని, ఈసారి అంతకు మించిన హై వోల్టేజ్ డ్రామాతో అదరగొడతాడని టాక్. దర్శకుడు ఈ సన్నివేశాన్ని ఎంతో క్రియేటివ్‌గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్ టాలీవుడ్‌లో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తుందా? అంటే రిలీజ్ తర్వాతే అసలు సమాధానం తెలుస్తుంది.
