The Paradise: భారతీయ సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో కొత్త అవకాశాలు తెరుచుకుంటున్నాయి. తాజాగా ‘ది ప్యారడైస్’ సినిమా బృందం హాలీవుడ్ సహకారంతో గ్లోబల్ రీచ్ కోసం చర్చలు ప్రారంభించింది. ఈ సందర్భంగా వారు కనెక్ట్ మాబ్‌సీన్ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అలెగ్జాండ్రా ఇ. విస్కాంటితో సమావేశమయ్యారు.
సినిమా గ్లోబల్ ప్రాజెక్ట్‌గా ఎలా రూపుదిద్దుకోవాలనే అంశంపై ఇరు బృందాలు చర్చించాయి. ఈ సహకారం ద్వారా భారతీయ సినిమాకు అంతర్జాతీయ మార్కెట్‌లో కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అయితే సహకారం సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు.
Also Read: Shraddha Kapoor: సంచలన బయోపిక్ చేస్తున్న శ్రద్ధా కపూర్!
‘ది ప్యారడైస్’ థ్రిల్లర్ డ్రామాగా రూపొందుతోంది. ఈ చిత్రం సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కుతుండగా, కథాంశం కూడా ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుందని సమాచారం. హాలీవుడ్ సంస్థలతో జరుగుతున్న ఈ కూటమి ద్వారా భారతీయ సినిమా స్థాయిని గ్లోబల్ వేదికపై మరింత బలపరిచే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే భవిష్యత్‌లో మరిన్ని భారతీయ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది.