Forest Department: కొన్ని రోజుల క్రితం కేరళలోని వయనాడ్‌లోని పంచరకోడ్ ప్రాంతంలో రాధ (45) అనే మహిళ పులి దాడిలో మరణించింది. ఆ తరువాత, వయనాడ్ లోని వైతిరి ప్రాంతంలోని కాఫీ తోటలో కుళ్ళిపోయిన పులి మృతదేహం కనిపించింది.
ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల్లోనే, మరో మూడు పులులు చనిపోయాయి. వయనాడ్‌లోని కురిచియాడు అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్‌లో ఉన్న అటవీ శాఖ సిబ్బంది రెండు పులుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. సమీపంలోని కాఫీ తోటలో మరో పులి కూడా చనిపోయి కనిపించింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది.
వరుసగా మూడు పులులు మరణించిన తరువాత, రాష్ట్ర అటవీ మంత్రి ఎ.కె. సుచింత్రన్ ఈ కారణాన్ని పరిశోధించడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనికోసం, నార్తర్న్ జోన్ చీఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ కె.ఎస్. దీప నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. పులుల మరణాలకు గల కారణాన్ని అటవీ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం వెల్లడించింది.
ఈ మూడు పులి పిల్లల మరణానికి గల కారణాన్ని అటవీ శాఖ ప్రత్యేక దర్యాప్తు బృందం వెల్లడించింది. మగ పులి దాడి చేయడంతో మూడు పులి పిల్లలు చనిపోయాయని అటవీ అధికారులు తెలిపారు. అంతేకాకుండా కాఫీతోటలో ఆడ పులి రాధను చంపిన పులి కూడా ఇదేనని దర్యాప్తు బృందం తేల్చింది.
ఇది కూడా చదవండి: Repo Rate: ఏదైనా లోన్స్ తీసుకున్నారా? మీకో గుడ్ న్యూస్.. ఐదేళ్ల తరువాత RBI ఇలాచేసింది !
Forest Department: అలా మగ పులి ఎందుకు చేసింది అనే దానిపై అటవీ అదిఆరులు స్పష్టత ఇచ్చారు. చిన్న పిల్లలు ఉన్న ఆడ పులులు సాధారణంగా సంభోగానికి దూరంగా ఉంటాయి. ఇది మగ పులులకు కోపం తెప్పిస్తుంది. అప్పుడు మగ పులులు పిల్లలపై తమ కోపాన్ని చూపిస్తాయి. చనిపోయిన మూడు పిల్లలకు కూడా అదే గతి పట్టి ఉండవచ్చు.
ఆ పిల్లలకు మెడలు మరియు శరీరాలపై అనేక గాయాలు అయ్యాయి. ఈ గాయాలు మరొక పులి దాడి వల్ల సంభవించినట్లు తెలుస్తోంది. చనిపోయిన పులి పిల్లల మరణానికి కారణం వెన్నెముక విరిగిపోవడం మరియు వెన్నుపాము తెగిపోవడం అని తేల్చారు.
అలాగే ఆడ పులి మరణానికి కారణం పుర్రె పగులడంతో పాటు మెదడు గాయం కావడమని తేలింది. ఈ రెండూ మరొక పులి దాడి వల్ల సంభవించాయి. శవపరీక్ష సమయంలో పులి కాటు గుర్తులు కూడా కనిపించాయి. దీంతో పులుల మరణాల మిస్టరీ వీడినట్టయింది.