Yamadonga

Yamadonga: యమ దొంగ రీ-రిలీజ్‌తో జక్కన్న-తారక్ మ్యాజిక్ మళ్లీ సందడి!

Yamadonga: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి కలయికలో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘యమ దొంగ’ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఫాంటసీ జోనర్‌లో రాజమౌళి సత్తా చాటిన తొలి చిత్రం ఇది. అప్పట్లో విజువల్ ఎఫెక్ట్స్‌తో ‘మగధీర’కు ముందే ఈ సినిమా సంచలనం సృష్టించింది.

ఎన్టీఆర్ డైనమిక్ పెర్ఫార్మెన్స్, మోహన్ బాబు పవర్‌ఫుల్ రోల్‌తో ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు, ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా మే 18న ‘యమ దొంగ’ గ్రాండ్ రీ-రిలీజ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. 4K ప్రింట్‌లో రీ-మాస్టర్ చేసిన ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది.

Also Read: Jr NTR: ఎన్టీఆర్ చిక్కిపోవడానికి కారణం అదే!

Yamadonga: న్యూట్రల్ ఫ్యాన్స్‌లోనూ ఈ సినిమాకు భారీ క్రేజ్ ఉంది. రాజమౌళి మార్క్ విజువల్స్, తారక్ ఎనర్జీ, గుండెల్ని పిండేసే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ‘యమ దొంగ’ మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ విజువల్ వండర్ ఎలాంటి మాయాజాలం చేస్తుందో చూడాల్సిందే.

యమదొంగ మూవీ వీడియో సాంగ్ :

 

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *