Kingdom: విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’ సినిమా రిలీజ్‌కు సర్వం సిద్ధం అయ్యింది. గౌతమ్ తిన్ననూరి రూపొందించిన ఈ స్పై యాక్షన్ డ్రామా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెయిడ్ ప్రీమియర్ షోలు ఈసారి ఉండవని చిత్రబృందం స్పష్టం చేసింది. అయితే, అమెరికాలోని కొన్ని థియేటర్లలో బుధవారం రాత్రి 11 గంటలకు తొలి ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. యూఎస్‌లో తూర్పు సమయం మధ్యాహ్నం 1:30, సెంట్రల్‌లో 12:30, పశ్చిమ తీరంలో ఉదయం 10:30 నుంచి ఈ షోలు మొదలవుతాయి. విజయ్ ఫ్యాన్స్‌కు ఈ చిత్రం ఓ స్పెషల్ ట్రీట్‌గా నిలవనుంది.
