Dhruv Jurel

Dhruv Jurel: ధ్రువ్ జురెల్ తొలి టెస్ట్ సెంచరీ.. భారత సైన్యానికి అంకితం

Dhruv Jurel: యువ క్రికెటర్ ధ్రువ్ జురెల్ తన టెస్ట్ కెరీర్‌లో సాధించిన మొట్టమొదటి సెంచరీని భారత సైన్యానికి అంకితమిచ్చారు.వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ (125 పరుగులు) పూర్తి చేసిన అనంతరం సెంచరీని భారత సైన్యానికి అంకితమిచ్చారు. “అర్ధ సెంచరీ సాధించినప్పుడు నేను మా నాన్నకు సెల్యూట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాను. అయితే, నా తొలి టెస్టు సెంచరీని భారత సైన్యానికి అంకితం చేయాలని నా మనసులో ఎప్పటి నుంచో ఉంది. ఈ రోజు అది సాధ్యమైంది. మా నాన్న సైన్యంలో పనిచేశారు, అందుకే చిన్నప్పటి నుండి నాకు ఆర్మీతో అనుబంధం ఉంది.

మేము యుద్ధ రంగంలో పోరాడేవాళ్ళం, వారు సరిహద్దులో చేసే పోరాటానికి చాలా తేడా ఉంటుంది. దాన్ని దీనితో పోల్చడం సరికాదు. నాకు సైన్యం అంటే చాలా గౌరవం ఉంది.” అని అన్నారు. ధ్రువ్ జురెల్ తండ్రి నేమ్ చంద్ జురెల్ ఇండియన్ ఆర్మీలో (కార్గిల్ యుద్ధంలో పోరాడిన) హవల్దార్‌గా పనిచేశారు.

ఇది కూడా చదవండి: Shoaib Malik Divorce: మూడవ భార్యకు కూడా షోయబ్ మాలిక్ విడాకులు!

అంతకుముందు ఇంగ్లాండ్‌తో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్‌లో కూడా, ధ్రువ్ జురెల్ అర్ధ సెంచరీ చేసిన తర్వాత మిలిటరీ సెల్యూట్ చేసి తన తండ్రికి ఆ గౌరవాన్ని అంకితం చేశారు. 24 ఏళ్ల వయసులో, జురెల్ వెస్టిండీస్‌పై తొలి టెస్ట్ సెంచరీ చేసిన ఐదవ భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు, విజయ్ మంజ్రేకర్, ఫరోఖ్ ఇంజనీర్, అజయ్ రాత్రా, వృద్ధిమాన్ సాహాల తర్వాత ఈ ఘనత సాధించాడు. కాగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు జురెల్ 125 పరుగులు సాధించారు. ఆట ముగిసే సమయానికి భారత్ ఐదు వికెట్లకు 448 పరుగులు చేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *