Rana Naidu Teaser: నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధమవుతున్న ‘రానా నాయుడు’ సీజన్ 2పై నటుడు రానా దగ్గుబాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విక్టరీ వెంకటేశ్, అర్జున్ రాంపాల్‌లతో కలిసి రానా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కు కరణ్ అన్షుమణ్ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 13న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సిరీస్ టీజర్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది.
ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ, మొదటి సీజన్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభించినప్పటికీ, తెలుగు ప్రేక్షకులు ఊహించిన స్థాయిలో ఆకర్షితులు కాలేదని వెల్లడించారు. దీనికి కారణం సీజన్ 1లోని అధిక హింస, బూతు సన్నివేశాలని సూచనగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, సీజన్ 2లో తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా మార్పులు చేసినట్లు రానా తెలిపారు.
Also Read: Ram Charan-Sujith: సంచలనం.. రామ్ చరణ్-సుజిత్ కాంబోలో మాస్ మూవీ?
Rana Naidu Teaser: బూతు సన్నివేశాలను తగ్గించి, హింసను కాస్త ఎక్కువగా చూపించినట్లు వివరించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సీజన్ 1కి వచ్చిన విమర్శలను పరిగణనలోకి తీసుకుని, కొత్త సీజన్‌లో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రీకరణ జరిగినట్లు రానా సూచించారు. ఈ మార్పులు ఎంతవరకు ఆదరణ పొందుతాయో వేచి చూడాలి.