Watermelon Seeds

Watermelon Seeds: పుచ్చకాయ గింజల్లో దాగిన ఆరోగ్య రహస్యాలు

Watermelon Seeds: పుచ్చకాయ గింజలు పడేయకండి – వీటిలో దాగి ఉంది ఆరోగ్య రహస్యం!
వేసవిలో ఎక్కువ మంది తినే పండు పుచ్చకాయ. ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. కానీ పుచ్చకాయ తినేశాక అందరూ చేస్తూ ఉండే ఒక పొరపాటు – దాని గింజలను వదిలేయడం!

అసలు గింజల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా?

పురుషుల ఆరోగ్యానికి మంచిదే :
పుచ్చకాయ గింజల్లో ఉండే పోషకాలు స్పెర్మ్ కౌంట్ పెంచుతాయి. సంతాన సమస్యలు ఉన్నవారికి ఇవి బాగా ఉపయోగపడతాయి.

బరువు తగ్గాలనుకుంటే ఇవి బెస్ట్ : 
ఇవిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. రోజూ కొంచెం గింజలు తింటే బరువు తగ్గడంలో సహాయపడతాయి.

గుండెకు మంచి రక్షణ : 
గింజల్లో ఉండే కొవ్వులు ఆరోగ్యకరమైనవి. ఇవి గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తాయి.

మెదడు చురుగ్గా పనిచేస్తుంది : 
ఈ గింజల్లో మెగ్నీషియం, ఐరన్ లాంటి పదార్థాలు మెదడుకు అవసరం. జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది.

చర్మం, జుట్టుకు మంచి ఫలితం :
గింజల్ని పొడి చేసి ముఖానికి రాసుకోవచ్చు. చర్మం మెరిసిపోతుంది. జుట్టు పెరుగుతుంది, రాలదు.

  • ఇలా వాడొచ్చు:
    వేపి తినొచ్చు
  • సలాడ్స్‌లో కలిపి తినొచ్చు
  • నీటిలో మరిగించి టీలా తాగొచ్చు
  • ఫేస్ ప్యాక్‌గానూ వాడొచ్చు

ఇకపై పుచ్చకాయ తిన్న తర్వాత గింజలు పడేయకండి. ఆరోగ్యానికి ఇవి చాలా ఉపయోగపడతాయి!

గమనిక: ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్ ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చింది. సంబంధిత విషయాలపై ఆసక్తి ఉన్న పాఠకుల కోసం అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ లోని అంశాలను ఫాలో అయ్యే ముందు మీ ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించాల్సిందిగా మహా న్యూస్ సూచిస్తోంది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *