Mass Jathara: మాస్ మహారాజ్ రవితేజ ఖాతాలో మరో మాస్ బ్లాస్ట్ సిద్ధమవుతోంది. ‘మాస్ జాతర’ సినిమా పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. దర్శకుడు భాను బోగవరపు ఈ చిత్రాన్ని రవితేజ స్టైల్‌కు తగ్గట్టుగా హై ఓల్టేజ్ ఫార్మాట్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఫ్యాన్స్‌లో జోష్ నింపాయి. తాజాగా, ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘తూ మేరా లవర్’ రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం గ్రాండ్‌గా ప్రకటించింది.
Also Read: Court OTT Release: ఓటిటిలోకి కోర్ట్.. పాన్ ఇండియా రేంజ్!
Mass Jathara: ఏప్రిల్ 14న ఈ మాస్ బీట్ సాంగ్ రిలీజ్ కానుంది. కొత్త పోస్టర్‌లో రవితేజ స్వాగ్‌తో ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రంలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా కనిపించనుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం సినిమాకు మరో హైలైట్ కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఈ సాంగ్‌తో ‘మాస్ జాతర’ క్రేజ్ ఆకాశాన్ని తాకనుందని ఫ్యాన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. మరి, ఈ మాస్ జాతర బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తుందో చూడాలి.