Delhi Results: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇప్పుడు EVMల లెక్కింపు జరుగుతోంద. ట్రెండ్స్‌లో బీజేపీ 42 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
కాంగ్రెస్ 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది. అంటే ట్రెండ్స్‌లో బిజెపి మెజారిటీ మార్కును దాటింది.
న్యూఢిల్లీ స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి అరవింద్ కేజ్రీ కల్కాజీ స్థానం నుంచి అతిషి, జంగ్పురా నుంచి మనీష్ సిసోడియా, పట్పర్గంజ్ నుంచి అవధ్ ఓజా వెనుకబడి ఉన్నారు.
ఫిబ్రవరి 5న ఢిల్లీలోని 70 స్థానాలకు 60.54% ఓటింగ్ జరిగింది. 14 ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. బిజెపి 12 అంచనాల్లో , కేజ్రీవాల్ 2 అంచనాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అంచనా వేయబడింది.
మధ్యాహ్నం 12 గంటల నాటికి ఢిల్లీలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో స్పష్టంగా తెలుస్తుంది.
ఇది కూడా చదవండి: Leave Rejected: వీడి ఫస్ట్రేషన్ తగలెయ్య.. సెలవు ఇవ్వలేదని నలుగురిని పొడిచి పడేశాడు!
కౌంటింగ్ కు కొద్దిసేపటి ముందు, ఢిల్లీ ముఖ్యమంత్రి మరియు కల్కాజీ నుండి ఆప్ అభ్యర్థి అయిన అతిషి మాట్లాడుతూ, “ఇది సాధారణ ఎన్నిక కాదు, మంచికి, చెడుకి మధ్య జరిగే పోరాటం. ఢిల్లీ ప్రజలు ఆప్ మరియు కేజ్రీవాల్ తో నిలబడుతున్నారు. కేజ్రీవాల్ నాలుగోసారి ముఖ్యమంత్రి అవుతారు” అని అన్నారు.
