Telangana: అమ్మో చ‌లి.. వ‌ణికిస్తోంది మ‌రి!

Telangana:తెలంగాణ రాష్ట్రంలో గ‌త వారం రోజులుగా క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోతున్నాయి. ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. ఫ‌లితంగా చ‌లి ప్ర‌భావం పెరిగింది. దీంతో ప్ర‌జ‌లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బుధ‌, గురువారాల్లో ఈ చ‌లి తీవ్ర‌త మ‌రింత‌గా పెరిగింది. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం ప‌రిధిలో క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు మ‌రింత‌గా ప‌డిపోయి న‌గ‌ర‌వాసుల‌ను భ‌య‌పెడుతున్న‌ది. తెల్ల‌వారుజామున పొగ‌మంచు క‌మ్ముకొని చ‌లి తీవ్ర‌త పెరిగింది.

Telangana:బుధ‌వారం రాష్ట్రంలో స‌గ‌టున 29.2 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు సాధార‌ణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తగ్గుముఖం ప‌ట్టాయి. హైద‌రాబాద్ న‌గ‌రంలో స‌గ‌టున 15.01 క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వ‌గా, శివార్ల‌లో మాత్రం అత్య‌ల్పంగా స‌గ‌టున 12.1 డిగ్రీల క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. ప‌టాన్‌చెరు ప్రాంతంలో అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. ఈ నెల‌తో పాటు డిసెంబ‌ర్‌, జ‌న‌వ‌రి నెల‌ల్లో మ‌రింత‌గా ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోయే అవ‌కాశం ఉన్న‌ద‌ని వాతావ‌ర‌ణ శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు.

Telangana:హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోని ప‌టాన్‌చెరులో 12.2, రాజేంద్ర‌న‌గ‌ర్ 13, హ‌య‌త్‌న‌గ‌ర్ 14.6, హ‌కీంపేట 15.3, దుండిగ‌ల్ 15.3 డిగ్రీల చొప్పున క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌ల చొప్పున న‌మోద‌య్యాయి. ఈ ఉష్ఱోగ్ర‌త‌లు రానున్న రోజుల్లో మ‌రింత‌గా దిగ‌జారితే న‌గ‌ర‌వాసులు చ‌లి ప్ర‌భావంతో వ‌ణికి పోవాల్సి వ‌స్తుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hyderabad: మంత్రి పొంగులేటితో ఈటల భేటీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *