Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనబోయే జట్లు ప్రకటించినప్పటి నుండి ఆస్ట్రేలియా టైటిల్ వేటలో హాట్ ఫేవరెట్ గా ఉన్న విషయం తెలిసిందే. ఐసీసీ ట్రోఫీ అంటేనే వారు వేరే లెవెల్ ఆట తీరును ప్రదర్శిస్తారు. అయితే ఆస్ట్రేలియా జట్టు ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మాత్రం గాయాలతో, రిటైర్మెంట్ ప్రకటనలతో సతమతమవుతోంది. ఇప్పటికే వారి సీనియర్ పేసర్లు ప్యాట్ కమైన్స్ మరియు జాస్ హేజిల్ వుడ్ గాయం కారణంగా టోర్నమెంట్ కి దాదాపుగా దూరమయ్యారు. ఇప్పుడు ఆ లిస్టులో మరొక ఆస్ట్రేలియన్ స్టార్ ప్లేయర్ చేరడం గమనార్హం..!
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఇప్పటికే గాయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ చాంపియన్స్ ట్రోఫీ కు ముందు బలమైన ఎదురుదెబ్బలు తింటోంది. ఆలాంటి సమయంలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్ అనుకోకుండా వన్డేల నుంచి వీడ్కోలు పలికి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ స్టార్ ఆల్ రౌండర్ 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడంతో ఈ నెల 19 నుంచి జరిగే ఈ ట్రోఫీకి కూడా అతడు దూరమైపోయాడు.
ఇప్పటికే జట్టులో కీలక ఆటగాళ్లు అయిన కమిన్స్, మిచెల్ మార్ష్, హాజెల్‌వుడ్ గాయాలతో బాధపడడంతో ఐసీసీ మెగా టోర్నీ కోసం సరైన జట్టును ఎంపిక చేయడానికి సెలెక్టర్లు చాలా కష్టపడుతున్నారు. స్టొయినిస్ రిటైర్మెంట్ ప్రకటనతో అతడి స్థానంలో మరో ఆటగాడిని వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతూ తొడ కండర గాయం వల్లే మార్కస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: A virus that infects dogs: కుక్కలతో పిల్లలు ఆడుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త!
Champions Trophy: అయితే, అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో మాత్రం సభ్యుడిగా అతడు కొనసాగుతానని చెప్పాడు. 2021 టీ20 వరల్డ్ కప్, 2023 వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో మార్కస్ సభ్యుడు. వన్డేల్లో 71 మ్యాచ్‌లు ఆడి 26.69 సగటుతో 1495 పరుగులు చేసి, 48 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో 74 మ్యాచ్‌లు ఆడి 1245 పరుగులు సాధించి, 45 వికెట్లు తీసుకున్నాడు. అయితే, తన పదేళ్ల కెరీర్‌లో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… స్టొయినిస్ ముందుగా ఎంపిక చేసిన ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉన్నాడు. ఒకవేళ అతనిని తుదిజట్టులో ఎంపిక చేయట్లేదన్న నిర్ణయం ముందే తెలిసి రిటైర్మెంట్ ఇచ్చాడు అని అనుకుంటే అలాంటి సమయంలో ఇటువంటి ఒక పేస్ ఆల్ రౌండర్ ను అసలు 15 మంది జట్టుల సభ్యులలోనే ఎంపిక చేయరు. దీంతో కొందరు మాత్రం దేశం తరఫున వన్డేలకు బదులుగా బయటి టీ20 లీగ్స్ ఆడేందుకు స్టొయినిస్ మొగ్గు చూపుతున్నాడని… అక్కడ వచ్చే డబ్బు కోసమే వన్డేలకు రిటైర్మెంట్ ఇచ్చాడని అంటున్నారు. మరి దీనిపై నిజాలు ఏమిటనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు.
కెప్టెన్ కమిన్స్ మరియు పేసర్ హాజెల్‌వుడ్ గాయాల కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యారు. కమిన్స్ కెప్టెన్సీలోనే ఆస్ట్రేలియా 2023 వన్డే వరల్డ్ కప్ సాధించింది. మిచెల్ మార్ష్ కూడా గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగాడు. జనవరి 13న ప్రకటించిన ప్రాథమిక జట్టులో ఈ నలుగురు ఉన్నారు. అయితే ఈ నెల 12 వరకు జట్టులో మార్పులు చేసుకోవచ్చు కాబట్టి క్రికెట్ ఆస్ట్రేలియా కొత్తగా మరో నలుగురితో వీరి స్థానాలను భర్తీ చేయనుంది.

