Most wanted criminal: ప్రభాకర్‌ది చిత్తూరు జిల్లా వడ్డిపల్లి గ్రామం. నిందితుడిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 80కి పైగా చోరీ కేసులున్నాయి. 2020 మొదటిసారి విశాఖలో అరెస్ట్ అయిన ప్రభాకర్.. 2022లో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. అప్పటి నుండి పోలీసులకు దొరక్కుండా తిరుగుతున్నాడు. తాజాగా గచ్చిబౌలి ప్రిజం పబ్‌లోనే కానిస్టేబుల్ బత్తుల ప్రభాకర్‌పై కాల్పులు జరిపారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలో గన్ ఫైరింగ్ కలకలం రేపింది. పోలీసులపై కాల్పులు జరిపాడు మోస్ట్ వాంటెడ్ నిందితుడు బత్తుల ప్రభాకర్. ప్రిజం పబ్‌లో ఉన్న ప్రభాకర్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా కాల్పులకు తెగబడ్డాడు. రెండు రౌండ్ల కాల్పులు జరపడంతో కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి, బౌన్సర్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. తప్పించుకునేందుకు ప్రయత్నించిన దొంగను అతికష్టం మీద అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఇది కూడా చదవండి: Interstate Robbery: వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ దొంగతనాలు..8 మంది అరెస్ట్.. రూ.3.51 కోట్ల నగదు స్వాధీనం
కాగా.. తెలంగాణ, ఏపీలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ 80 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. బత్తుల ప్రభాకర్‌ను అరెస్టు చేసి అతని వద్ద 2 గన్‌లను, 23 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులపై కాల్పులు జరిపిన దొంగ బత్తుల ప్రభాకర్‌ను అరెస్ట్ చేసిన దృశ్యాలు
తెలంగాణ, ఏపీలో 80 కేసుల్లో నిందితుడిగా ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్
బత్తుల ప్రభాకర్‌ను అరెస్టు చేసి అతని వద్ద 2 గన్‌లను, 23 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు https://t.co/EhHAakJsy6 pic.twitter.com/yEvPWurcPf
— Telugu Scribe (@TeluguScribe) February 1, 2025


