Bigg Boss 9: తెలుగు బిగ్ బాస్ హౌస్ ఫినాలేకు చేరువవుతున్న తరుణంలో, హౌస్‌మేట్స్ మధ్య పోటీ మరింత పెరిగింది. ఈ సీజన్‌లో అత్యంత ఫేవరేట్ కంటెస్టెంట్స్‌లో ఒకరైన తనూజ (Thanuja Puttaswamy)కు ఆమె అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన శుభవార్త ఎట్టకేలకు దక్కింది. ఎప్పుడు చివరి నిమిషంలో కెప్టెన్సీని చేజార్చుకునే తనూజ… ఈసారి మాత్రం గట్టి పట్టుదలతో ఆ హోదాను దక్కించుకుంది.
కెప్టెన్సీ టాస్క్
‘బీబీ రాజ్యం’లో హోరాహోరీ పోరు తొమ్మిదవ వారం కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ ‘బీబీ రాజ్యం’ పేరుతో ఆసక్తికరమైన టాస్క్‌ను ఇచ్చాడు. ఈ టాస్క్‌లో కళ్యాణ్ (కింగ్), రీతూ & దివ్య (క్వీన్స్). కమాండర్స్ గా తనూజ, నిఖిల్, డిమోన్ పవన్, సంజన ఉన్నారు.
ఈ ఆటలో ఎప్పుడూ లేని విధంగా తనూజ పూర్తి ‘శివంగి’లా రెచ్చిపోయింది. మొదటి రోజు కమాండర్స్ నిఖిల్, డిమోన్ పవన్ ఆడి రాజు దివ్యను ఓడించి నిఖిల్‌ను కింగ్ చేశారు.
చివరిగా గెలిచిన తనూజ
తరువాతి రోజు, కమాండర్స్ అయిన తనూజ, సంజనలు పోటీ పడ్డారు. వీరిలో తనూజ అత్యద్భుతంగా ఆడి కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచింది. ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్ల జాబితాలో నిఖిల్, రీతూ, తనూజతో పాటు ప్రజల నుంచి సుమన్, ఇమ్మాన్యుయేల్‌లు కూడా పోటీ పడ్డారు. ఈ పోరులో చివరికి తనదైన ఆటతీరుతో గట్టి పోటీ ఇచ్చి తనూజ తొమ్మిదవ వారం కెప్టెన్సీని సొంతం చేసుకుంది.
ఇది కూడా చదవండి: Delhi Car Blast: ఢిల్లీ బాంబు బ్లాస్ట్.. బాంబర్ ఉమర్ నబీ ఇంటిని పేల్చేసిన అధికారులు
కెప్టెన్‌గా తనూజ: ఇక హౌస్‌మేట్స్‌కు చుక్కలేనా?
నిజానికి, తనూజకు ఒక హోదా ఉందంటే ఆమె నోటికి పని చెబుతూనే ఉంటుందని హౌస్‌మేట్స్‌కు, ప్రేక్షకులకు బాగా తెలుసు. గతంలో ఆమె రెండుసార్లు రేషన్ మేనేజర్‌గా ఉన్నప్పుడు పెట్టిన రూల్స్, కఠిన నిబంధనలు హౌస్‌మేట్స్‌ను చుక్కలు చూపించాయి. సంజన, రీతూ, దివ్యతో సహా చాలా మందితో ఆమె గొడవలు పీక్ స్టేజ్‌కు చేరాయి.
“రేషన్ మేనేజర్‌గానే చుక్కలు చూపించిన తనూజ… ఇక కెప్టెన్‌గా హౌస్‌ను ఎలా ఆడుకుంటుందో, రూల్స్‌తో ఎలా వేధించబోతోందో” అని హౌస్‌మేట్స్ భయపడుతున్నారు.
పదో వారం కెప్టెన్సీ కూడా తనూజకే!
ఇదిలా ఉండగా, తాజా ఎపిసోడ్ (నవంబర్ 13వ) హైలైట్స్‌లో, తనూజ మరోసారి తన సత్తా చాటినట్లు తెలుస్తోంది. రాజు కళ్యాణ్‌తో జరిగిన మరో కీలకమైన టాస్క్‌లో చురుకుగా పాల్గొని కళ్యాణ్‌ను ఓడించింది. దీని ద్వారా పదో వారం కెప్టెన్సీ కూడా తనూజ సొంతం చేసుకున్నట్టు సమాచారం. ఫ్యామిలీ వీక్ సమయంలో కెప్టెన్ అవ్వడం ఆమెకు, ఆమె అభిమానులకు మరింత సంతోషాన్ని ఇచ్చే విషయం.
వైరుధ్యాలు: నెగిటివిటీ ఉన్నా తనదైన శైలిలోనే ఆట!
తనూజకు ఎంతటి ఫ్యాన్ బేస్ ఉందో, అదే స్థాయిలో నెగిటివిటీ కూడా ఉంది. ఆమెను ‘బిగ్ బాస్ ముద్దుబిడ్డ’ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటారు. హోస్ట్ నాగార్జున, బిగ్ బాస్ టీమ్ ఆమె పట్ల ఫేవరేటిజం చూపిస్తున్నారని విమర్శలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ, తనూజ మాత్రం తగ్గేదే లే అంటూ తనదైన ఆటతో ముందుకు వెళుతోంది. ఎవరితో గొడవలు ఉన్నా వెంటనే రీసాల్వ్ చేసుకుంటూ, మళ్లీ గొడవ వచ్చేసరికి విరుచుకుపడుతూనే.. తన గమ్యం వైపు సాగుతోంది. ఈ తాజా కెప్టెన్సీతో హౌస్‌లో తనూజ తన రూల్స్‌తో ఎలాంటి డ్రామాను సృష్టిస్తుందో చూడాలి.
