Thank You Dear

Thank You Dear: ‘థాంక్ యూ డియర్’ ఫస్ట్ లుక్ ఆవిష్కరణ.. తమ్మారెడ్డి భరద్వాజ ఆశీస్సులతో ఘనంగా విడుదల!

Thank You Dear: టాలీవుడ్ యువ హీరో ధనుష్ రఘుముద్రి నటించిన ‘థాంక్ యూ డియర్’ చిత్ర ఫస్ట్ లుక్ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్‌ను చూసిన తమ్మారెడ్డి, యువ బృందం పనితనాన్ని మెచ్చుకుంటూ, ఈ సినిమా ధనుష్ కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందని, ప్రేక్షకులను ఆకట్టుకొని ఘనవిజయం సాధిస్తుందని ఆశీర్వదించారు.ఈ వేడుకలో ధనుష్ మాట్లాడుతూ, ఇది తన రెండో సినిమా అని, తమ్మారెడ్డి లాంటి సినీ పెద్ద ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించడం గౌరవంగా ఉందని తెలిపారు. ఈ చిత్రం ప్రేక్షకుల మనసు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిర్మాత పప్పు బాలాజీ రెడ్డి, ఈ సినిమా యువతను ఆకర్షిస్తుందని, తమ్మారెడ్డి మద్దతు తమకు స్ఫూర్తినిచ్చిందని అన్నారు. లైన్ నిర్మాత పుణీత్ రెడ్డి, ఈ చిత్రం విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హెబ్బా పటేల్, రేఖ నిరోషా, నాగ మహేష్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని మహా లక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తోట శ్రీకాంత్ కుమార్ రచన, దర్శకత్వంలో నిర్మించారు. సుభాష్ ఆనంద్ సంగీతం, పి ఎల్ కె రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Chiranjeevi-Anil Ravipudi: చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాలో శోభన!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *