Thandel Movie:

Thandel Movie: తండేల్‌ సినిమా టికెట్‌ రేట్స్ పెంపునకు స‌ర్కార్ గ్రీన్‌సిగ్న‌ల్‌

Thandel Movie: యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య, సాయిప‌ల్ల‌వి హీరో, హీరోయిన్లుగా న‌టించిన తండేల్ చిత్రం విడుద‌ల‌కు స‌ర్వం సిద్ధ‌మైంది. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 7న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ చందూ మొండేటి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. బ‌న్నీ వాసు భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచ‌నాల‌తో ముందుకొస్తున్న ఈ సినిమా టికెట్ రేట్ల పెంపున‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కార్ అనుమ‌తించింది.

Thandel Movie: తండేల్‌ సినిమా టికెట్ రేట్ల‌ను సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో రూ.50, మల్టి ఫ్లెక్స్ థియేట‌ర్ల‌లో రూ.75 చొప్పున అనుమ‌తిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సినిమా విడుద‌ల రోజు నుంచి 7 రోజుల‌పాటు టికెట్ ధ‌ర‌ల‌ను పెంచుకునేందుకు అవ‌కాశం ఇచ్చారు. దీంతో చిత్రం యూనిట్ హ‌ర్షం వ్య‌క్తం చేసింది.

Thandel Movie: అయితే తెలంగాణ‌లో మాత్రం పెంపుపై ఆశ‌లు పెట్టుకోలేద‌ని తెలిసింది. పుష్ప 2 రిలీజ్ స‌మ‌యంలో చోటుచేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో టికెట్ రేట్ల పెంచ‌బోమ‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఆ త‌ర్వాత కొంత స‌డ‌లించిన స‌ర్కారు.. సంక్రాంతికి విడుద‌లైన సినిమాల‌కు టికెట్ రేట్ల పెంపున‌కు అవ‌కాశం క‌ల్పించింది. అయినా కూడా టికెట్ రేట్ల పెంపు విష‌యంపై చిత్ర నిర్మాత చొర‌వ తీసుకోలేద‌ని తెలుస్తున్న‌ది.

Thandel Movie: దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. బుక్‌మై షోలో టికెట్ అమ్మకాలకు భారీ గిరాకి ఉన్న‌ట్టు తెలుస్తున్న‌ది. ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు కూడా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అక్కినేని అభిమానులు మ‌రింత ఉత్కంఠ‌తో వేచి ఉన్నారు. మ‌రి ఈ సినిమాతో నాగ‌చైత‌న్య హిట్ అందుకుంటారో లేదో చూడాలి మ‌రి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Parliament Budget Session: ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు.. పూర్తయిన సన్నాహాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *