Thaman: సినిమా పాటలు యువతను ఆకర్షిస్తున్నాయి. లిరిక్స్, ట్యూన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కలిస్తే సోషల్ మీడియాలో ఆ పాటలు తిరుగులేని ట్రెండ్ సృష్టిస్తాయి. కొంతకాలం అనిరుధ్ సంగీతం యువతను ఉర్రూతలూగించింది. ‘బీస్ట్’, ‘మాస్టర్’ పాటలతో పాటు ‘జైలర్’లోని ‘హుకుం టైగర్ కా హుకుం’ సాంగ్ సంచలనం సృష్టించి, సోషల్ మీడియాను షేక్ చేసింది. అయితే, టాలీవుడ్ నుంచి సంగీత దర్శకుడు థమన్ ఈ ట్రెండ్‌కు గట్టి సమాధానమిచ్చాడు. ‘డాకు మహారాజ్’ టైటిల్ సాంగ్‌తో యువతను ఉర్రూతలూగించాడు.
Also Read: Coolie: ‘కూలీ’లో రోలెక్స్ రేంజ్ కామియో.. బాక్సాఫీస్ దద్దరిల్లడం ఖాయం!
Thaman: ఈ పాట తెలుగు యువతను ఆకట్టుకోవడమే కాక, తమిళ ఆడియన్స్ కూడా ఎడిట్స్‌తో రచ్చ చేశారు.
తాజాగా థమన్ మరో సంచలనం ‘సర్కారురా’ పాటను రిలీజ్ చేశాడు. ఈ పాటకు ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన వస్తోంది. వివిధ ఫ్యాన్‌డమ్స్ ఈ సాంగ్‌తో ఎడిట్స్‌ను స్టార్ట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి. ఈ పాటతో థమన్ మరోసారి తన సత్తా చాటి, సంగీత ప్రియుల హృదయాల్లో సిక్సర్ కొట్టాడు. టాలీవుడ్ సంగీతం ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్ చేస్తోంది!