Daaku Maharaaj

Daaku Maharaaj: “డాకు మహారాజ్” ఓఎస్టీకి ముహూర్తం ఫిక్స్ చేసిన థమన్!

Daaku Maharaaj: బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రౌతేలా హీరోయిన్స్ గా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన భారీ చిత్రం “డాకు మహారాజ్”. అయితే ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ వసూళ్లు సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ చిత్రం ఓటిటిలోకి వచ్చాక సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా ఓఎస్టీ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్ గా దీనిపై తమన్ ఓ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా ఓఎస్టీని ఈ ఉగాది కానుకగా అందిస్తున్నట్టుగా తాను కన్ఫర్మ్ చేసాడు. సో ఈ ట్రీట్ కోసం ఎదురు చూస్తున్నవారు ఇంకొన్ని రోజులు ఆగితే సరిపోతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా దాదాపు 140 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Murali Naik: అమర వీరుడు మురళీనాయక్‌కు నివాళులర్పించిన మంత్రులు లోకేశ్‌, అనగాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *