Thalliki Vandanam:

Thalliki Vandanam: ఏపీ విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌.. ఆ ప‌థ‌కాల‌కు కేటాయింపులు

Thalliki Vandanam: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం బ‌డ్జెట్‌లో విద్యారంగానికి కీల‌క ప్రాధాన్యం ఇచ్చింది. విద్యార్థులు అభ్యున్న‌తికి చేప‌ట్టే ప‌థ‌కాల‌కు బ‌డ్జెట్‌లో కేటాయింపులు చేసి తన ప్రాధమ్యాల‌ను తెలియ‌జేసింది. ఈ మేర‌కు త‌ల్లికి వంద‌నం, నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ శాఖ‌కు నిధులు కేటాయించింది. త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం అమలు కోసం రూ.9,407 కోట్లు, నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ శాఖ‌కు 1,228 కోట్లను ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ బ‌డ్జెట్‌లో కేటాయించారు.

Thalliki Vandanam: త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం కింద 2025-26 విద్యా సంవ‌త్స‌రానికి ఈ బ‌డ్జెట్‌ను ప్ర‌తిపాదించారు. ఎంత మంది పిల్ల‌లున్నా అంత మంద‌కి రూ.15 వేల చొప్పున త‌ల్లుల ఖాతాల్లో ప్ర‌భుత్వం నిధుల‌ను జ‌మ చేయ‌నున్న‌ది. మే నెల‌లో ఈ ప‌థ‌కం కింద నిధులు జ‌మ చేయ‌నున్న‌ది. ఈ ప‌థ‌కం అమ‌లుకు రూ.11 వేల కోట్లు అవ‌స‌రం అవుతాయ‌ని తొలుత అధికారులు అంచ‌నా వేశారు. అయితే మార్గ‌ద‌ర్శ‌కాల అనంత‌రం ల‌బ్ధిదారుల సంఖ్య‌ను బ‌ట్టి ఖ‌ర్చుపై స్ప‌ష్ట‌త రానున్న‌ది.

Thalliki Vandanam: అదే విధంగా నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ శాఖ ద్వారా ఏఐ వంటి ఆత్యాధునిక సాంకేతిక అంశాల‌పై విద్యార్థుల‌కు శిక్ష‌ణ ఇవ్వాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యించింది. ఆ మేర‌కే బ‌డ్జెట్‌లో రూ.1,228 కోట్లను కేటాయించడం విశేషం. రాష్ట్రంలోని విద్యార్థులు ప్ర‌పంచ స్థాయిలో పోటీప‌డేలా తీర్చిదిద్దాల‌న్న‌ది ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని మంత్రి ప‌య్యావుల ఆకాంక్షించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  CM Chandrababu: నిర్మలా సీతారామన్ పొగడ్తలతో ముంచెత్తిన సీఎం చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *