Thalapathy Vijay: నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ పాల్గొన్న కరూర్ సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై తొలుత విజయ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ ద్వారా ఘటనపై దర్యాప్తు జరిపించాలని హైకోర్టును అభ్యర్థించారు. అయితే హైకోర్టులో విచారణ అనంతరం సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ సిట్ దర్యాప్తును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Thalapathy Vijay: ఐపీఎస్ అధికారి అశ్రాగార్గ్ నేతృత్వంలో మద్రాస్ హైకోర్టు ఏర్పాటు చేసిన సిట్ అధికారులు తమ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ టీవీకే పార్టీ సుప్రీంకోర్టుకు అందజేసిన తన పిటిషన్‌లో పేర్కొన్నది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో స్వతంత్ర దర్యాప్తు చేయించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆపార్టీ కోరింది.
Thalapathy Vijay: రాష్ట్ర పోలీస్ అధికారులతో కూడిన సిట్ తమ పార్టీ పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తుందని టీవీకే పార్టీ తన పిటిషన్‌లో సుప్రీంకోర్టుకు తెలిపింది. కరూర్ తొక్కిసలాట ఘటన విషయంలో విజయ్ తీరును మద్రాస్ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. తొక్కిసలాట జరిగిన వెంటనే విజయ్ అక్కడి నుంచి మాయం కావడం, ప్రభుత్వం కూడా ఆయనపై ఎలాంటి చర్య తీసుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పబట్టింది.