Ajith and Vijay: ప్రముఖ తమిళ స్టార్ హీరో అజిత్ కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కరాన్ని ప్రకటించడం అభిమానుల మధ్య రచ్చకు దారి తీసింది. తమిళనాడులో విజయ్ వర్సెస్ అజిత్ అన్నట్టుగా ఉంటుంది. విజయ్ సాధించిన రికార్డులను, అజిత్ సాధించిన రికార్డులను కంపేర్ చేస్తూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా గొడవలు పడుతూ ఉంటారు. తాజాగా విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టి డీఎంకేను వచ్చే ఎన్నికల్లో ఢీకొట్టబోతున్నాడు. అందుకే అజిత్ ను తమవైపు తిప్పుకోవడానికి డీఎంకే వర్గాలు అతని పేరును పద్మ అవార్డులకు సిఫార్స్ చేశాయని, బీజేపీ కూడా అజిత్ మీద సాఫ్ట్ కార్నర్ ఉండటంతో అతనికి పద్మ భూషణ్ అవార్డును ఇచ్చిందని అంటున్నారు. దాంతో ఇది పొలిటికల్ గేమ్ లో భాగంగా వచ్చిన అవార్డు తప్పితే ప్రతిభతో రాలేదని విజయ్ ఫ్యాన్స్ అజిత్ అభిమానులను రెచ్చగొడుతున్నారు. వారు మాత్రం… నటుడిగా అజిత్ రేంజ్ ఏమిటనేది అందరికీ తెలుసని, అందుకే కేంద్ర పద్మ భూషణ్ కు ఎంపిక చేసిందని అంటున్నారు. ఇదిలా ఉంటే అజిత్ నటించిన ‘పట్టుదల’ చిత్రం ఫిబ్రవరి 6న జనం ముందుకు రాబోతోంది.
