TGSRTC:

TGSRTC: ఆ జిల్లాలో ప్ర‌జార‌వాణాకు మ‌హ‌ర్ద‌శ‌

TGSRTC:ఆ జిల్లాలో ప్ర‌జార‌వాణాకి మ‌హ‌ర్ద‌శ ప‌ట్టుకున్న‌ది. ఎన్నాళ్లుగానో స‌రైన వ‌స‌తులకు నోచ‌ని ఆ జిల్లాలో ప్ర‌భుత్వం కీల‌క స‌దుపాయాల‌ను క‌ల్పించేందుకు ప‌నులు చేప‌ట్టింది. ఇప్ప‌టికే ఆ ప‌నులు ముమ్మ‌రంగా కొన‌సాగుతున్నాయి. మారుమూల జిల్లా అయిన ములుగు జిల్లాలోనే ఆర్టీసీ స‌దుపాయాల క‌ల్ప‌న‌కు ప్ర‌భుత్వ శ్రీకారం చుట్టింది.

TGSRTC: ములుగు జిల్లాలో వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 28 నుంచి 31 వ‌ర‌కు జ‌రిగే మేడారం మ‌హాజాత‌ర కోసం ప్ర‌త్యేకంగా తాత్కాలిక బ‌స్టాండ్ ఏర్పాటుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ జాత‌ర‌కు రాష్ట్రంతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి కోటిన్న‌ర మంది భ‌క్తులు త‌ర‌లివ‌స్తార‌ని అంచ‌నా. దీంతో భ‌క్తుల సౌక‌ర్యార్థం వై జంక్ష‌న్ వ‌ద్ద 20 ఎక‌రాల్లో దాదాపు 3,600 బ‌స్సుల‌ను నిలిపేందుకు వీలుగా తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు ప‌నులు ఇప్ప‌టికే చురుకుగా సాగుతున్నాయి.

TGSRTC: అదే విధంగా జిల్లాలో మెరుగైన ర‌వాణా కోసం రూ.5.91 కోట్ల వ్య‌యంతో ఏటూరు నాగారంలో కొత్త బ‌స్ డిపో నిర్మాణ ప‌నులు జ‌రుగుతుండ‌గా, ములుగు జిల్లా కేంద్రంలో కొత్త బ‌స్టాండ్ నిర్మాణం కొన‌సాగుతున్న‌ది. ములుగులోని పాత బ‌స్టాండ్‌ను పూర్తి కూల్చివేసి, రూ.4.8 కోట్ల ఖ‌ర్చుతో కొత్త బ‌స్టాండ్ నిర్మాణ ప‌నుల‌ను ఇప్ప‌టికే ప్రారంభించారు. అత్యాధునిక సౌక‌ర్యాల‌తో కూడిన ఈ బస్టాండ్‌తో ములుగు జిల్లా ప్ర‌జ‌ల‌కు మెరుగైన ర‌వాణా స‌దుపాయం ఏర్ప‌డ‌నున్న‌ది.

TGSRTC: అదే విధంగా ఏటూరు నాగారంలో కొత్త బ‌స్ డిపో నిర్మాణ ప‌నులు కొన‌సాగుతున్నాయి. ప్ర‌స్తుతం ఫౌండేష‌న్ ప‌నులు పూర్త‌య్యాయి. 3.79 ఎక‌రాల విస్తీర్ణంలో రూ.5.91 కోట్ల వ్య‌యంతో ఈ డిపో నిర్మాణం జ‌రుగుతున్న‌ది. ఈ డిపో ద్వారా మేడారం, ఏటూరు నాగారం వంటి ప్రాంతాల‌కు ర‌వాణా సేవ‌లు మెరుగ‌వుతాయి. ఈ రెండు నిర్మాణాల‌తో మారుమూల ములుగు జిల్లాలో ఆర్టీసీ స‌దుపాయాలు మ‌రింత‌గా చేరువ కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *