TGSRTC: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త అందనే అందింది. ఎప్పుడెప్పుడా వారంతా ఎదురు చూస్తున్న టీజీఎస్‌ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలకు సమయం ఆసన్నమైంది. సుదీర్ఘకాలం తర్వాత ఆర్టీసీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఖాళీల గుర్తించిన యాజమాన్యం ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఈ మేరకు ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైంది.
TGSRTC: టీజీఎస్‌ఆర్టీసీలో 3038 ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ కూడా వెల్లడించడం కూడా శుభ పరిణామం. ఆయా ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ వేసి సాధ్యమైనంత మేరకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు.
TGSRTC: టీజీఎస్ ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం తీసుకొచ్చిన తర్వాత మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యంతో బస్సుల్లో రద్దీ పెరిగింది. పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో 165 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, వారికి రూ.5,500 కోట్ల మేరకు ఆదా అయినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ రద్దీ దృష్ట్యా మహాలక్ష్మి పథకం కోసం ఆర్టీసీ ఇటీవలే కొత్త బస్సులను కొనుగోలు చేసింది. ఆ మేరకు ఉద్యోగాల భర్తీ చేపట్టనన్నట్టు తెలిపింది.
TGSRTC: ఇప్పటికే కాంగ్రెస్ సర్కారు హయాంలో 60 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఉద్యోగ నోటిఫికేషన్ల క్యాలెండర్ ప్రకారం.. త్వరలో భారీ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. దానిలో భాగంగానే ఆర్టీసీలో సుదీర్ఘకాలం తర్వాత ఉద్యోగాల భర్తీ చేపడుతున్నట్టు తెలిపారు. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు.
ఆర్టీసీలో గుర్తించిన ఖాళీలు
డ్రైవర్ – 2,000
శ్రామిక్ – 743
డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ – 84
డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానికల్) 114
డిపో మేనేజర్/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ – 25
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) -23
సెక్షన్ ఆఫీసర్ (సివిల్) – 11
అకౌంట్ ఆఫీసర్ – 6
మెడికల్ ఆఫీసర్స్ జనరల్ – 7
మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్టు – 7
