TGSRTC: శ్రీరామనవమిని పురష్కరించుకొని భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని రాములోరి భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ సంస్థ ఎప్పటిలాగానే శుభవార్తను అందజేసింది. మునపటి మాదిరిలాగానే తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో సీతారాముల కల్యాణ తలంబ్రాలను ఇంటికే పంపిణీ చేసే పవిత్ర కార్యానికి ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టింది.
TGSRTC: సీతారాముల కల్యాణ మహోత్సవానికి వెళ్లలేని వారికి కల్యాణ తలంబ్రాలు కావాలంటే టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాలతోపాటు సంస్థ వెబ్‌సైట్ (tgsrtc logistics.co.in)లో రూ.150 చెల్లించి చిరునామా వివరాలను నమోదు చేసుకుంటే ఇంటికే తలంబ్రాలను సరఫరా చేస్తామని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.
TGSRTC: ఈ మేరకు హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో రాములోరి తలంబ్రాల బుకింగ్‌ను టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఇప్పటికే ప్రారంభించారు. తొలుత బుకింగ్ పోస్టర్‌ను విడుదల చేసిన ఆయన ఆన్‌లైన్ బుకింగ్ ను కూడా ప్రారంభించారు. ఈ నెల (ఏప్రిల్) 6న భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవం అనంతరం ఆ కల్యాణ తలంబ్రాలను హోం డెలివరీ చేయనున్నారు.
TGSRTC: రాష్ట్రంలోని అన్ని లాజిస్టిక్స్ కౌంటర్లతోపాటు ఆన్‌లైన్ ద్వారా కూడా తలంబ్రాల బుకింగ్‌ను నమోదు చేసుకోవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. సంస్థ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని వివరించారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీజీఎస్ ఆర్టీసీ కాల్ సెంబర్ 040-69440069, 040-69440000 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.
