TG Vishwa Prasad: హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్‌లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ సంచలన కొనుగోలు చేశారు. పెద్దమ్మతల్లి గుడి సమీపంలో రూ.50 కోట్ల విలువైన ఖరీదైన ప్లాట్‌ను సొంతం చేసుకున్నారు. ఈ ప్రాంతం సెలబ్రిటీల నివాసంగా పేరొందగా, రెబల్ స్టార్ ప్రభాస్ ఇల్లు కూడా ఇక్కడే ఉంది. ఆసక్తికరంగా, విశ్వప్రసాద్ కొనుగోలు చేసిన ప్లాట్ ప్రభాస్ ఇంటికి ఎదురుగానే ఉంది. గత ఏడాది ‘మిస్టర్ బచ్చన్’ సినిమా నష్టాలతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారనే ప్రచారం జరిగినా, వేల కోట్ల ఆస్తులున్న విశ్వప్రసాద్‌కు ఇవి సామాన్యమేనని సన్నిహితులు చెబుతున్నారు. త్వరలో ఈ ప్లాట్‌లో లగ్జరీ ఇంటి నిర్మాణం ప్రారంభం కానుంది. ప్రభాస్‌తో ‘రాజాసాబ్’ సినిమా నిర్మించిన విశ్వప్రసాద్, ఇప్పుడు ఆయన ఇంటి పొరుగున ఇల్లు కట్టి మరింత సన్నిహితంగా మారనున్నారని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.

