TGTET

TGTET: తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల

TGTET: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. పాఠశాల విద్యా శాఖ అధికారులు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) 2026 షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేశారు. ఏటా రెండుసార్లు టెట్‌ను నిర్వహించాలనే నిబంధనను పటిష్టంగా అమలు చేస్తూ ఈ నోటిఫికేషన్ విడుదల కావడం విశేషం. పూర్తి నోటిఫికేషన్ శుక్రవారం (నవంబర్ 14) విడుదల కానుంది.

దరఖాస్తు, పరీక్ష తేదీలు
ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, టెట్ పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇలా ఉన్నాయి:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: నవంబర్ 15, 2025 (శనివారం)
దరఖాస్తుకు తుది గడువు: నవంబర్ 29, 2025
పరీక్షల నిర్వహణ: జనవరి 3, 2026 నుంచి జనవరి 31, 2026 వరకు

వచ్చే ఏడాది జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేంద్రాలలో ఈ పరీక్షలు సుదీర్ఘ కాలంలో జరుగుతాయి. ఈ పరీక్షల్లో రెండు పేపర్లు ఉంటాయి.

Also Read: Punjab Terror Plot: పంజాబ్‌లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం

ప్రభుత్వ ఉపాధ్యాయులకూ టెట్ తప్పనిసరి
ఉపాధ్యాయ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో పాటు, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా ఈ టెట్ పరీక్ష కీలకమైంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా తమ ఉద్యోగాల్లో కొనసాగాలంటే టెట్‌లో తప్పనిసరిగా అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో, ఇప్పటికే టీచర్లుగా పనిచేస్తున్న వారంతా టెట్ పాస్ కావాల్సిన అవసరం ఉంది.

కాగా, ఏటా రెండు సార్లు టెట్‌ నిర్వహించాలనే నిబంధనను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టినా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ నిబంధనను పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. దీని ఫలితంగా 2025లో తొలి విడత టెట్ జూన్‌లో నిర్వహించి, జులై 22న ఫలితాలు కూడా వెల్లడించారు. తాజాగా, ఇది రెండో విడత నోటిఫికేషన్‌గా విడుదలైంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *