TG TET 2025 Results

TG TET 2025 Results: తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల.. 33.98 శాతం ఉత్తీర్ణత

TG TET 2025 Results: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TET) జూన్‌ సెషన్‌ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఈ ఫలితాలను ప్రకటించారు.

మొత్తం హాజరైనవారు – అర్హత సాధించినవారు

జూన్‌ 18 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ పరీక్షలకు మొత్తం 1,37,429 మంది హాజరయ్యారు. వారిలో 30,649 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అంటే మొత్తం 33.98% మంది మాత్రమే పాస్‌ అయ్యారు.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: రాజ్యాంగ విలువలను కాపాడారు.. ధన్‌ఖడ్‌ రాజీనామా పై స్పందించిన పవన్ కల్యాణ్‌

పేపర్‌ వారీగా హాజరు శాతం

  • పేపర్ 1 (ప్రైమరీ టీచర్లు): 63,261 మంది దరఖాస్తు చేసుకోగా, 74.65% మంది పరీక్షకు హాజరయ్యారు.

  • పేపర్ 2 (గణితం, సైన్స్): 1,20,392 మంది దరఖాస్తు చేసుకోగా, 73.48% మంది హాజరయ్యారు.

  • పేపర్ 2 (సామాజిక అధ్యయనాలు): 76.73% మంది హాజరయ్యారు.

  • రెండు పేపర్లకు దరఖాస్తు చేసిన వారు సుమారు 15 వేల మంది ఉన్నారు.

ఫలితాలు ఎలా చూడాలి?

ఫలితాలను చూడాలనుకునే అభ్యర్థులు.. 👉 అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *