తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయ్యి. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందంటూ కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. భవన్ ఎదురుగా బీఆర్ఎస్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. అది కాస్త తోపులాటకు దారితీసింది. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపు చేస్తున్నారు.