Bhuvanagiri

Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం

Bhuvanagiri: ఏ రా అంటెండర్ ..ఏంట్రా ఇది. నువ్వు నిత్యం పని చేసే ..చోటే రోజు చూస్తున్నావ్ కదా..ఇలా చేస్తే …ఏమవుతుందో అని. మరి ఇలా ఎలా చేసావ్. ఓ …బయటకు రాదులే…లేక నన్ను ఎవరు పట్టుకుంటారులే అనుకున్నావా . పండగ సమయంలో కొంత గ్యాప్ వచ్చినా …ని పాపం మాత్రం పండింది రా . ఆ పాప విషయంలో నువ్వు చేసిన..ఈ నీచపు పనికి …నువ్వు పని చేసే చోటికే ..నిందితుడిగా ఇప్పుడు వెళ్లాల్సి వచ్చింది కదా …

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. భువనగిరి బాలసదన్​లో ఓ అనాథ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు జిల్లా లీగల్ సర్వీసెస్ కు చెందిన అటెండర్ . ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 14న బాలసదన్​ లో జరిగిన కార్యక్రమానికి జిల్లా లీగల్ సర్వీసెస్ తో పాటు మరికొందరు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జిల్లా లీగల్ సర్వీసెస్ విభాగంలో పని చేస్తున్న అటెండర్​ కూడా హాజరయ్యాడు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న బాలికను చూసిన అటెండర్​.. ఆ బాలిక పట్ల అమానుషంగా వ్యవహరించాడు.

ఈ విషయాన్ని ఏడుస్తూ బాలసదన్​ సిబ్బందికి చెప్పింది బాధిత బాలిక. అయినా గోప్యంగా ఉంచేందుకు దసరా పండగ సందర్భంగా ఆబాలికవలిగొండ మోడల్​ స్కూల్​ కు బాల సదన్​ సిబ్బంది తీసుకొచ్చారు. అనంతరం ఈ విషయం వెలుగులోకి రావడంతో భువనగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఫోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Crime News: ఢిల్లీలో చార్టర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్య.. వారిని వదిలేయండి అంటూ సూసైడ్ నోట్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *