Hyderabad: తెలంగాణను చలి వణికిస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం… మరో రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది.వచ్చే రెండు రోజులు ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. ఉదయం పొగమంచు సమస్య ఉండనుంది. దీంతో మార్నింగ్ వాకింగ్ కు వెళ్లేవారు, వాహనదారులు ఇబ్బందులు పడనున్నారు. తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రత 11.73 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఏరియా-డిగ్రీలు
బీహెచ్‌ఈఎల్‌లో 7.4
రాజేంద్రనగర్‌లో 8.2
గచ్చిబౌలి 9.3 డిగ్రీలు
వెస్ట్ మారేడ్‌పల్లిలో 9.9
కుత్బుల్లాపూర్ 10.2
మచ్చబొల్లారంలో 10.2
శివరాంపల్లిలో 10.3
జీడిమెట్ల 11.4
బాలానగర్ 11.5
పటాన్‌చెరు 11.7
షాపూర్ నగర్ 11.7
లింగంపల్లి 11.8
బోయిన్‌పల్లి 11.9
బేగంపేట 12
ఆసిఫ్‌నగర్ 12
నేరెడ్‌మెట్ 12.1
లంగర్‌హౌస్ 12.2
మోండా మార్కెట్ 12.4
చందానగర్ 12.7
షేక్‌పేట 12.8
మాదాపూర్ 12.8
ముషీరాబాద్ 12.9
చాంద్రాయణగుట్ట 13
కూకట్‌పల్లి 13.1
గోల్కొండ 13.2
సఫిల్‌గూడ 13.3
హయత్ నగర్ 13.3
ఉప్పల్ 13.4
మల్లాపూర్ 13.5
ఆదర్శనగర్ 13.5

