America: నల్లగొండ జిల్లాకు చెందిన యువతి అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది. అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన ఆమెకు ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల చికిత్స ఆలస్యం అయింది.
నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం పందెనపల్లికి చెందిన ప్రియాంక (26), ఢిల్లీలో అగ్రికల్చర్‌లో బీఎస్సీ పూర్తి చేసిన తరువాత, 2023లో అమెరికాలోని అలబామా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదవడానికి వెళ్లింది. పీజీ చదువుతో పాటు పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తూ, స్థిరమైన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఆమె ఆరోగ్యం క్షీణించింది.
ఈ నెల 4వ తేదీన తండ్రి వెంకట్‌రెడ్డి ఫోన్ చేసినప్పుడు, మూడు రోజులుగా దంత సంబంధిత సమస్యతో బాధపడుతోందని ప్రియాంక చెప్పింది. ఆరోగ్య బీమా (ఇన్సూరెన్స్) లేకపోవడంతో వైద్య ఖర్చులు భరించడం కష్టమవుతుందని చెప్పింది. అయితే, ఇన్సూరెన్స్‌కు అప్పటికే దరఖాస్తు చేసిందని తెలిపింది.
America: 5వ తేదీన ఇన్సూరెన్స్ ఆమోదం పొందిన తర్వాత ఆసుపత్రికి వెళ్లిన ప్రియాంకకు వైద్యులు బ్లడ్ ఇన్‌ఫెక్షన్ ఉందని నిర్ధారించారు. తక్షణ చికిత్స అవసరం అని చెప్పినా, తాను తర్వాత వస్తానని చెప్పి తిరిగి వెళ్ళిపోయింది. 6వ తేదీన స్నానం చేయడానికి వెళ్లిన ప్రియాంక అక్కడే పడిపోయింది. స్నేహితులు ఆసుపత్రికి తీసుకెళ్లగా, పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో హెలికాప్టర్ ద్వారా సమీపంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె అపస్మారక స్థితిలో ఉండగా, వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు.
Also Read: Shravana Rao Arrested: ఫోన్ ట్యాపింగ్ నిందితుడు శ్రవణ్‌రావు అరెస్టు
America: ఒక రోజు పాటు వెంటిలేటర్‌పై ఉంచిన తర్వాత, కుటుంబ సభ్యులతో మాట్లాడిన అనంతరం 8వ తేదీన ఆమె మృతి చెందింది. ప్రియాంక మృతదేహం బుధవారం హైదరాబాద్‌కు రానుంది.
ఈ ఘటన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను తీవ్ర దుఃఖంలో ముంచింది. కూతురు ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేస్తుందని కలలుకన్న తల్లిదండ్రులకు ఇది తీరని లోటుగా మారింది. ఈ సంఘటనపై పలువురు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.