టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కోహ్లి క్రీడా వారసత్వంలో ఒక అద్భుతమైన అధ్యాయాన్ని కొనసాగిస్తున్నారని అభిప్రాయపడ్డారు. అనేక రికార్డులు సృష్టించి, అత్యంత క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన ఆటగాడు కోహ్లీ అని సీఎం కొనియాడారు. విరాట్ కోహ్లీ ఎంతో మందికి యువకులకు స్పూర్తిదాయకమన్న సీఎం.. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నందున తదుపరి అధ్యయంలో మరిన్ని విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి: IPL 2025 Revised Schedule: మే 17 నుంచి ఐపీఎల్ పునః ప్రారంభం.. జూన్ 3న ఫైనల్
కోహ్లీ తన టెస్టు కెరీర్‌లో 123 టెస్టులు ఆడి 46.85 సగటుతో 30 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలతో 9230 పరుగులు చేసిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. 2011లో వెస్టిండీస్‌పై జరిగిన అతి పొడవైన ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన అతను 2012లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై తన తొలి టెస్ట్ సెంచరీని సాధించాడు. 2025లో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడాడు.
మరోవైపు సుదీర్ఘ ఫార్మాట్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్ ప్రకటించడంతో టెస్టుల్లో తదుపరి కెప్టెన్ ఎవరు అనే చర్చ జరుగుతోంది. ఇంతకుముందు వరకు బుమ్రా పేరు ప్రముఖంగా వినిపించేది. కానీ గాయాల నేపథ్యంలో కెప్టెన్సీ రేసులో బుమ్రా లేడని తెలుస్తోంది. గిల్ లేదా అయ్యర్ లలో ఎవరో ఒకరికి ఛాన్స్ ఇస్తారా అన్నది చూడాలి.