Jailer 2: రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 చిత్రం సన్ పిక్చర్స్ నిర్మాణంలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో తెలుగు నటి షమ్నా కాసిం అలియాస్ పూర్ణ, ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఆమె సన్నివేశాల చిత్రీకరణకు 20 రోజుల సమయం పట్టిందని తెలుస్తోంది. 2023లో విజయం సాధించిన జైలర్ సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, యోగి బాబు, శివ రాజ్‌కుమార్, ఎస్.జె. సూర్య వంటి తారాగణం ఉన్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ చెన్నై, కేరళ, కోయంబత్తూర్‌లో జరిగింది. నందమూరి బాలకృష్ణ కీలక గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ యాక్షన్ కామెడీ చిత్రం 2026లో విడుదల కానుంది.

