Gaddar Awards: తెలుగు చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు గద్దర్ అవార్డులు ఇవ్వనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలసిందే. దీంతో ఈ గద్దర్ అవార్డులు ప్రదానం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజ్ కు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.
Also Read: AP Government: సినిమా పరిశ్రమ అభివృద్ధిపై AP ప్రభుత్వం ప్రత్యేక దృష్టి!
Gaddar Awards: ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గౌరవ కార్యదర్శి టి.ప్రసన్న కుమార్ కీలక ప్రకటన విడుదల చేశారు. 2024 సంవత్సరానికి గాను ఉత్తమ చలన చిత్రాలకు, ఉత్తమ కళాకారులు, సాంకేతిక నిపుణులకు తెలుగు చలన చిత్రం పరిశ్రమలోని ప్రముఖులు, గొప్ప వ్యక్తులైన ఎన్టీఆర్, పైడి జైరాజ్, బి.ఎన్. రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య పేర్లు మీద “గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్” ను ప్రదానం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.