Exhibitors Producers Meet: తెలుగు రాష్ట్రాల సినీ పరిశ్రమలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జూన్ 1 నుంచి ప్రకటించిన థియేటర్ల బంద్‌ను వాయిదా వేస్తూ తెలుగు ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలతో జరిగిన సమావేశంలో సమ్మె కంటే చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో పలు సమస్యలపై లోతైన చర్చ జరిగింది. థియేటర్లను మూసివేయకుండా, నడుపుతూనే సమస్యలకు పరిష్కారం కోసం కృషి చేయాలని అంగీకరించారు. దీంతో జూన్ 1 నుంచి ప్రకటించిన థియేటర్ల మూసివేత తాత్కాలికంగా రద్దయింది. సినీ పరిశ్రమలో గందరగోళ వాతావరణం సడలి, సామరస్య చర్చలతో పరిష్కార మార్గం సుగమమవుతోంది. ఈ నిర్ణయంతో సినీ అభిమానులతో పాటు థియేటర్ యాజమాన్యాలు ఊపిరిపీల్చుకున్నాయి. సమస్యలను పరిష్కరించేందుకు ఫిలిం ఛాంబర్ నిరంతరం చర్చలు కొనసాగిస్తోంది. ఈ పరిణామంతో సినీ పరిశ్రమలో సానుకూల వాతావరణం నెలకొంది.
