Telangana:తెలంగాణ రాష్ట్రంలోని రేషన్‌కార్డు లబ్ధిదారుల కుటుంబాలకు ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఇప్పటికే సన్నబియ్యం అందజేస్తున్న సర్కారు.. త్వరలో మరికొన్ని సరుకులను రేషన్ దుకాణాల ద్వారా అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఐదు రకాల నిత్యావసరాల సరుకులను పంపిణీ చేయనున్నది. ఈ మేరకు తెలంగాణ సాగునీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఈ అంశాన్ని ఇటీవల ధ్రువీకరించడం గమనార్హం.
Telangana:ఈ వానకాలం సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 70.82 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయిందని, ధాన్యం సేకరణలో తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఇదే సమయంలో రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే సన్నబియ్యంతో పాటు ఐదు రకాల నిత్యావరసాలు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.
Telangana:గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రేషన్ బియ్యంతోపాటు 9 రకాల నిత్ఆయవసరాల సరుకులను ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా అందజేసింది. నూనె, చింతపండు, పసుపు, పప్పు, ఉప్పుతో కలిపి 9 రకాల వస్తువులను అందజేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు నిత్యావసరాలను కుదించి, కేవలం బియ్యం మాత్రమే ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు మళ్లీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యావసరాల సరఫరాకు ముందుకు రావడంపై రేషన్ కార్డు లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
