Telangana:

Telangana: తొలుత ఆ న‌లుగురు ఎమ్మెల్యేల విచార‌ణ‌.. ఫిరాయింపు ఎమ్మెల్యేల విచార‌ణకు షెడ్యూల్‌

Telangana: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచార‌ణ‌కు స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు ప్ర‌త్యక్ష విచార‌ణ షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. తొలుత న‌లుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేల‌ను విచారించేందుకు నిర్ణ‌యించారు. ఇప్ప‌టికే ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు నోటీసులు జారీచేసిన స్పీక‌ర్‌.. వారిలో 8 మంది నుంచి రాత‌పూర్వకంగా వివ‌ర‌ణ‌లను తీసుకున్నారు. తాజాగా ప్ర‌త్య‌క్ష విచార‌ణ‌కు ఆదేశాల‌ను జారీచేశారు.

ఈ నెల 29న న‌లుగురు ఎమ్మెల్యేలు ప్ర‌త్య‌క్ష విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందిగా స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్‌కుమార్ నోటీసుల‌ను జారీచేశారు. ఎమ్మెల్యేలు కాలే యాద‌య్య‌, గూడెం మ‌హిపాల్‌రెడ్డి, ప్ర‌కాశ్‌గౌడ్‌, బండ్ల కృష్ణ‌మోహ‌న్‌రెడ్డికి ఆ నోటీసులు వెళ్లాయి. బీఆర్ఎస్ త‌ర‌ఫున కూడా ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలైన చింత ప్ర‌భాక‌ర్‌, క‌ల్వ‌కుంట్ల సంజ‌య్‌, ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డికి కూడా అసెంబ్లీ స్పీక‌ర్ నోటీసుల‌ను పంపారు.

ఇది కూడా చదవండి: Sheetal Devi: 18 ఏళ్ల‌కే చ‌రిత్ర సృష్టించిన శీతల్ దేవి.. చేతులు లేకపోయినా..!

తొలిరోజు విచార‌ణ సంద‌ర్భంగా బీఆర్ఎస్ పిటిష‌న‌ర్ల‌ను ఫిరాయింపు ఎమ్మెల్యేల న్యాయ‌వాదులు క్రాస్ ఎగ్జామినేష‌న్ చేయ‌నున్నారు. అదే విధంగా అక్టోబ‌ర్ 1న మ‌రోసారి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌ను పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాదులు క్రాస్ ఎగ్జామినేష‌న్ చేయ‌నున్నారు. ఈ మేర‌కు షెడ్యూల్ ఉంటుంద‌ని నోటీసుల్లో స్పీక‌ర్ పేర్కొన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *