Telangana: తెలంగాణలో దసరా పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటారు. మాంసం, మద్యంతో పండుగ చేసుకుంటారు. అయితే అక్టోబర్ 2న దసరా పండుగను జరుపుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈసారి పండుగకు ఓ చిక్కొచ్చిపడింది. అదే రోజు గాంధీ జయంతి ఉండటంతో మద్యం, మాంసం ప్రియులకు షాక్ తగిలింది. హైదరాబాద్ నగర పరిధిలో ఆ రోజు మాంసం, మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు.
Telangana: అక్టోబర్ 2న దసరా పర్వదినాన జీహెచ్ఎంసీ పరిధిలో మాంసం దుకాణాలు బంద్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశించారు. ఈ మేరకు నగర పరిధిలోని ఎద్దులు, గొర్రెలు, మేకల వధశాలలు, రిటైల్ దుకాణాలు, బీఫ్ దుకాణాలను మూసి వేయాలని జీహెచ్ఎంసీ ఆదేశించింది. ఈ మేరకు ఆయా దుకాణాలు మూసి ఉంచేలా సిబ్బంది పర్యవేక్షిస్తారని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
Telangana: జీహెచ్ఎంసీ చట్టం-1955 ప్రకారం.. దసరా రోజైన అక్టోబర్ 2న అన్ని రకాల మాంసం దుకాణాలను మూసి వేయాలని ఈ నెల 24న జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీ ప్రకటించింది. ఈ మేరకు ఆయా పరిధిలోని అధికారులందరూ సహకరించాలని కోరింది. మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణ చేపట్టి గాంధీ జయంతి పవిత్రతను కాపాడాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరారు.
ఈ నిర్ణయంతో మద్యం, మాంసంతో పండుగ చేసుకుందామనుకున్న ప్రజలకు నిరాశే ఎదురుకానున్నది. కేవలం పూజలకే పరిమితమవ్వాల్సి వస్తున్నది. దసరా అనే అత్యంత ఆదరణ కలిగిన పండుగ రోజు అయినా, జాతిపిత జయంతి కావడంతో జాతికి మరింత అత్యంత విలువను ఇవ్వాల్సి ఉంటున్నందున దానికే అందరూ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.