Telangana: తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతున్నది. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపు గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ న్యాయస్థానం మెట్లెక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. మూడు నెలల్లోగా చర్యలకు స్పీకర్‌కు సూచనలు చేసింది. దీనిపై శాసనసభ స్పీకర్ తాజాగా చర్యలకు ఉపక్రమించారు.
Telangana: పార్టీ ఫిరాయించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మందిలో ఐదుగురికి తాజాగా స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్‌కుమార్, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, అరెకపూడి గాంధీ, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్‌లు కొన్నాళ్లకే కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Telangana: ఆ 10 మందిలో తొలుత ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులను జారీ చేసినట్టు సమాచారం. పార్టీ ఎందుకు మారారో 30 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఫిరాయింపు ఎమ్మెల్యేలను నోటీసుల్లో స్పీకర్ ఆదేశించినట్టు తెలిసింది. గద్వాల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, భద్రాచలం ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరికపూడి గాంధీ, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావుకు స్పీకర్ నోటీసులను అందజేసినట్టు తెలుస్తున్నది.
Telangana: ఈ వ్యవహారం తాజాగా రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆ 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని భావిస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా తీసుకున్నది. గతంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్న రాష్ట్రాల ఘటనలను పరిగణనలోకి తీసుకొని, తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలకు ఉపక్రమిస్తుందని భావిస్తున్నారు.