Telangana:

Telangana: రేప‌టి నుంచే ఇంట‌ర్ ప్రాక్టిక‌ల్స్‌.. హాజ‌రుకానున్న 5.26 ల‌క్ష‌ల మంది విద్యార్థులు

Telangana: తెలంగాణ రాష్ట్రంలో ఇంట‌ర్మీడియ‌ట్ ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌లు రేప‌టి నుంచి (ఫిబ్ర‌వ‌రి 2) ప్రారంభం కానున్నాయి. ఫిబ్ర‌వ‌రి 21 వ‌ర‌కు ఈ ప‌రీక్ష‌లు కొన‌సాగనున్నాయి. ఈ ప‌రీక్ష‌ల‌కు రాష్ట్ర వ్యాప్తంగా 5.26 ల‌క్ష‌ల మంది విద్యార్థులు హాజ‌రు కానున్నారు. ప్రతి రోజూ ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, తిరిగి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఈ ప‌రీక్ష‌లను నిర్వ‌హించ‌నున్నారు.

Telangana: ఇంట‌ర్మీడియ‌ట్ ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ కోసం రాష్ట్ర‌వ్యాప్తంగా 1,440 ప‌రీక్ష కేంద్రాల‌ను అధికారులు సిద్ధం చేశారు. ఈ ప‌రీక్ష‌ల‌ను సైన్స్ విభాగం నుంచి 4 ల‌క్ష‌లకు పైగా విద్యార్థులు, వొకేష‌న‌ల్ విభాగం నుంచి ల‌క్ష‌కు పైగా విద్యార్థులు హాజ‌రుకానున్నారు. ఇప్ప‌టికే వెబ్ సైట్ల‌లో విద్యార్థుల హాల్ టికెట్ల‌ను అందుబాటులో ఉంచిన‌ట్టు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కార్య‌ద‌ర్శి కృష్ణ ఆదిత్య వెల్ల‌డించారు.

Telangana: ప‌రీక్ష‌ల‌కు ఎంపీసీ గ్రూప్ నుంచి తొలి సెష‌న్‌లో 1,35,474 మంది విద్యార్థులు హాజ‌రుకానున్నారు. రెండో సెష‌న్‌లో 1,38,533 మంది విద్యార్థులు హాజ‌రుకానున్నారు. ఈ రెండు సెష‌న్ల‌లో క‌లిపి 2,74,007 మంది విద్యార్థులు హాజ‌రుకానున్నారు. బైపీసీ గ్రూప్‌లో తొలి సెష‌న్ నుంచి 72,282 మంది విద్యార్థులు, సెష‌న్ 2కు 61,133 మంది విద్యార్థులు క‌లిపి 1,33,415 మంది విద్యార్థులు హాజ‌రు కానున్నారు.

Telangana: అదే విధంగా వొకేష‌న‌ల్ విద్యార్థులు సెష‌న్‌-1 కు 75,160 మంది విద్యార్థులు, రెండో సెష‌న్‌కు 43,610 మంది విద్యార్థులు హాజ‌రు కానున్నారు. మొత్తం క‌లిపి 1,18,770 విద్యార్థులు హాజ‌రవుతారు. రాష్ట్రంలోని ప్ర‌తి జిల్లాలోనూ ఇంట‌ర్మీడియ‌ట్ ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష కేంద్రాల‌ను ఏర్పాటు చేసిన‌ట్టు బోర్డు కార్య‌ద‌ర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *