TG TET 2024 Exams: నేటి నుంచి తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్షలు జరగనున్నాయి. ఆన్ లైన్ విధానంతో ఈ పరీక్షలను తెలంగాణ వ్యాప్తంగా 17 17 జిల్లాల్లోని 92 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. టెట్ ఎక్సమ్ కి మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా. అందులో పేపర్ -1 కి 94,327 మంది, పేపర్ 2కు 1,81,426 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఎగ్జామ్స్ 10 రోజుల పాటు జరగనున్నాయి. ఎక్సమ్ జరిగే తేదీల్లో మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు జరగనుంది. సెకండ్ సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు జరగనుంది. ఎగ్జామ్స్ సెంటర్స్ కి 15 నిమిషాల ముందుగానే చేరుకోవాలని అధికారులు అభ్యర్థులకు సూచిస్తునారు.. ఉదయం జరగనున్న ఎక్సమ్ కి 7.30 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. మధ్యాహ్నం జరగనున్న ఎక్సమ్ కి మధ్యాహ్నం 12.30 గంటల నుంచి లోనికి అనుమతించనున్నారు. ఉదయం సెషన్‌లో ఉదయం 8.45 గంటలకి, మధ్యాహ్నం సెషన్‌లో 1.45 గంటలకు గేట్లను క్లోజ్ చేయనున్నారు అధికారులు.

