Telangana:

Telangana: నేటి నుంచి ప్ర‌త్యేక అధికారుల పాల‌న‌ షురూ

Telangana: తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌లో ఈ రోజు (జ‌న‌వ‌రి 27) నుంచి ప్ర‌త్యేక అధికారుల పాల‌న కొనసాగుతుంది. జ‌న‌వ‌రి 26 నాటితో మున్సిప‌ల్ పాల‌క‌వ‌ర్గాల ఐదేండ్ల‌ ప‌ద‌వీకాలం ముగియ‌డంతో ఆ అర్ధ‌రాత్రి నుంచే ప్ర‌త్యేక పాల‌న మొద‌లైంది. ఇప్ప‌టికే మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌లో ప్ర‌త్యేక అధికారుల‌ను నియ‌మిస్తూ రాష్ట్ర మున్సిప‌ల్‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి దానకిషోర్ ఉత్త‌ర్వుల‌ను జారీ చేశారు.

Telangana: రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేష‌న్ల‌లో జ‌న‌వ‌రి 27 నుంచి ప్ర‌త్యేక పాల‌న కొన‌సాగుతుంది. తెలంగాణ‌లో 2020 జ‌న‌వరి 22న మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌రిగాయి. అదే నెల 27న మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్లలో ఎన్నికైన‌ పాల‌క‌మండ‌ళ్లు ఏర్పాట‌య్యాయి. దీంతో ఆయా పాల‌క‌మండ‌ళ్ల గ‌డువు ముగిసింది.

Telangana: ఇదిలా ఉండ‌గా, గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు 2021 ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగాయి. అదే నెల‌లో కొత్త పాల‌క‌వ‌ర్గం కొలువుదీరింది. దీంతోపాటు వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మం కార్పొరేష‌న్లు, మ‌రికొన్ని మున్సిపాలిటీల‌కు కూడా 2021లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ్గా, ఆయా పాల‌క‌మండ‌ళ్ల ప‌ద‌వీకాలం మ‌రో ఏడాదిపైగానే ఉన్న‌ది. జీహెచ్ఎంసీ విస్త‌ర‌ణ‌లో భాగంగా న‌గ‌ర శివారుల్లో ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేష‌న్ల‌ను గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిపల్ కార్పొరేష‌న్‌లో విలీనం చేయాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌తంలోనే వీటి ప‌రిధిలోని 51 గ్రామ పంచాయ‌తీల‌ను స‌మీప మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్లలో విలీనం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  High Alert: సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్‌ ప్రకటించిన కేంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *