Telangana Rains: తెలంగాణలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు మరో నాలుగు రోజులు కురిసే ఛాన్స్ ఉంది. అయితే, ఈరోజు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడినప్పటికీ, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని. భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Telangana Rains: జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలలో ఈరోజు (సెప్టెంబర్ 26) భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఇప్పటికే ఎల్లో ఎలర్ట్ జారీ చేశారు. ఇక రేపు అంటే సప్టెంబర్ 27న ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందంటున్నారు. దీంతో ఈ జిల్లాలకు కూడా వాతావరణశాఖ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. తెలంగాణలో గంటకు 35-50 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంటుంది. ఉరుములు, మెరుపులతో పాటుగా పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
Also Read: ఏపీకి వాన హెచ్చరిక.. కోస్తాలో ఈదురుగాలులు!