TG POLYCET Results 2025

TG POLYCET Results 2025: విద్యార్థులకు అలర్ట్.. పాలిసెట్ ఫలితాలు విడుదల

TG POLYCET Results 2025: తెలంగాణలో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్ (POLYCET) 2025 పరీక్ష ఫలితాలు శనివారం (మే 24) ఉదయం విడుదలయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన గారు హైదరాబాద్‌లో ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది పరీక్షకు 98,858 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 83,364 మంది (84.33%) ఉత్తీర్ణత సాధించారు.

పరీక్ష హాజరు, ఉత్తీర్ణత శాతం ఇలా ఉంది:

2025, మే 13న రాష్ట్రవ్యాప్తంగా 246 పరీక్ష కేంద్రాల్లో పాలిసెట్ పరీక్ష నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష జరిగింది. మొత్తం 1,06,716 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, వారిలో 98,858 మంది పరీక్షకు హాజరయ్యారు. హాజరు శాతం 92.64గా నమోదైంది.

  • బాలురు:
    హాజరు – 53,085 మంది
    ఉత్తీర్ణులు – 42,836 మంది (80.69%)

  • బాలికలు:
    హాజరు – 45,773 మంది
    ఉత్తీర్ణులు – 40,528 మంది (88.54%)

ఇది చూస్తే బాలికలు బాలుర కంటే మెరుగైన ఫలితాలు సాధించినట్టు స్పష్టమవుతోంది.

అర్హత మార్కులు, ర్యాంకుల వివరాలు:

పాలిసెట్ పరీక్షను 120 మార్కులకు నిర్వహించగా, కనీసం 36 మార్కులు పొందిన అభ్యర్థులు సాధారణంగా అర్హత సాధించారు. అయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఒక మార్కు మినహాయింపు ఇవ్వబడింది – అంటే వారికి అర్హత మార్కు 35గా నిర్ణయించారు.

ఈ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు మెరిట్ ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. వాటిలో:

  • ఎస్సీ విద్యార్థులకు – 18,037 ర్యాంకులు

  • ఎస్టీ విద్యార్థులకు – 7,459 ర్యాంకులు

ఫలితాల కోసం ఎక్కడ చూడాలి?

అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు:
👉 https://www.polycet.sbtet.telangana.gov.in

ఇంకెందుకు ఆలస్యం?

పాలిసెట్–2025లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు త్వరలో కౌన్సెలింగ్ ప్రక్రియకు సిద్ధమవ్వాలి. పాలిటెక్నిక్, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ, ఇతర డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఫలితాలు కీలకం కానున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Rajasthan: ఘోర బస్సు ప్రమాదం.. 12 మంది మృతి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *