Telangana: కోదాడ దళిత యువకుడు కర్ల రాజేశ్ (30) లాకప్‌డెత్ ఘటనపై పోలీస్ అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే దళిత, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. మూడు రోజులపాటు మృతదేహంతో ధర్నాలు, రాస్తారోకోలు చేసి స్తంభింపజేశారు. నవంబర్ నెలలో జరిగిన ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణ జరిపిన అనంతరం తాజాగా పోలీసు అధికారులపై వేటు వేశారు.
Telangana: లాక్‌ప్ డెత్ ఘటనకు బాధ్యులుగా కోదాడ రూరల్ సీఐ ప్రతాప్‌లింగంను సస్పెండ్ చేశారు. చిలుకూరు ఎస్ఐ సురేశ్‌రెడ్డిని సూర్యాపేట జిల్లా కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆదేశాలను జారీచేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు విషయంలో ఫిర్యాదు చేసినందుకు అమాయకుడైన కర్ల రాజేశ్ అనే యువకుడిని జైల్లో చిత్రహింసలు పెట్టడంతో లాకప్‌డెత్ జరిగింది. పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని నాలుగు రోజులపాటు చిత్రహింసలు పెట్టారు. ఈ ఘటనపై కోదాడ రూరల్ సీఐ, చిలుకూరు ఎస్ఐ, ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుపై ఆరోపణలు వచ్చాయి.
