Telangana Police: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ బందోబస్తు కట్టుదిట్టంగా ఏర్పాటు చేస్తన్నట్టు డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ ఖరారై, నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో పోలీస్ శాఖ పలు అంశాలను వెల్లడించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచే ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. ఈ కోడ్ ప్రకారం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నట్టు డీజీపీ హెచ్చరించారు.
Telangana Police: ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో రూ.50 వేలకు నగదును తీసుకెళ్లరాదు. ఒకవేళ తీసుకెళ్లిన వారు సరైన పత్రాలు చూపించాల్సి ఉంటుంది. లేకుంటే సీజ్ చేస్తారు. అక్రమ మద్యం, నగదు, మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. ఉచితాలు ఎక్కడా పంపిణీ చేయరాదు. ఒకవేళ అలా పంపిణీ చేసిన వారు శిక్షార్హులవుతారు. లైసెన్స్ కలిగిన ఆయుధాలను సమీప పోలీస్ స్టేసన్లలో అప్పజెప్పాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.
Telangana Police: రాష్ట్ర పోలీస్ శాఖ సిబ్బందితో పాటు వివిధ విభాగాల పోలీసులను ఎన్నికల బందోబస్తుకు ఏర్పాటు చేస్తున్నారు. వీరితోపాటు 2,000 మంది అటవీ, అగ్నిమాపక శాఖ సిబ్బందిని కూడా వినియోగించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు 24 గంటల పాటు ప్రత్యేక ఎన్నికల పోలీస్ కంట్రోల్ రూంనుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యవేక్షించనున్నారు.
